Venkateshwara Swamy Kalyanam: ఇబ్రహీంపట్నం, జనవరి 10 (మన బలగం): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్దండి గ్రామంలో శుక్రవారం స్వయంభు వేంకటేశ్వర స్వామి జాతర మహోత్సవం ఆడంబరంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు రోట్టె కిషన్ శర్మ, పవన్ శర్మ ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శాంతి యజ్ఞం, స్వామి వారికి పంచమృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక మండపంలో కళ్యాణం నిర్వహించారు. స్వామి వారికి మెట్‌పల్లి పట్టణ శ్రీసాయి శ్రీనివాస ఆస్పత్రి నిర్వాహకులు అవుట్ల లక్ష్మణ్ – పద్మ దంపతులు పట్టు వస్రాలు సమర్పించారు. అనంతరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా భక్తులు దర్శనం చేసుకున్నారు. అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సాన గంగారెడ్డి, మాజీ సర్పంచ్ కల్లెడ లక్షణ గంగాధర్, మాజీ ఎంపీటీసీ బాసెట్టి సంధ్య గణేశ్, ఆలయ కమిటీ సభ్యులు రామాంజనేయులు, గాండ్ల రాజు, కల్లెడ శ్రీనివాస్, దేశెట్టి రాజ, గంగారాం, తెడ్డు రాజారెడ్డి, దాసరి గంగ నర్సయ్య, అవుట్ల లక్ష్మణ్, శంకర్ మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.