Tribute to Ambedkar: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని శుక్రవారం సిరిసిల్లలో నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పూల మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. భారత స్వాతంత్ర్య పోరాటం, రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఆయన భారత మొట్ట మొదటి కేంద్ర లా అండ్ జస్టిస్ శాఖ మంత్రిగా సేవలు అందించారాని గుర్తు చేశారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు ఉపేందర్ రెడ్డి, రాజేశ్వర్, డీఎస్ సీడీవో విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.