- హాస్టల్స్‌లోని స్టోర్ రూమ్, కిచెన్ గది క్లీన్‌గా ఉండాలి
- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Collector Sandeep Kumar Jha: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 5 (మన బలగం): మహాత్మా జ్యోతిబాఫూలే విద్యాలయంలోని స్టోర్ రూమ్, కిచెన్ గది నిత్యం క్లీన్‌గా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఇప్పలపల్లి వద్ద ఉన్న మహాత్మా జ్యోతిబాఫూలే విద్యాలయాన్ని కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా విద్యాలయం ఆవరణ, తరగతి గదులు, వసతి గదులు, స్టోర్ రూం, కిచెన్ పరిశీలించారు. ఆహార పదార్థాలు నిల్వ చేసే, అలాగే సిద్ధం చేసే గదులు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. అనంతరం 7వ, 8వ తరగతి సిలబస్ ఎంతమేరకు పూర్తి అయింది ఆరా తీశారు. అన్ని తరగతుల సిలబస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. అన్ని తరగతుల విద్యార్థులతో నిత్యం ఆయా పాఠ్యాంశాలు చదివించాలని, రాయించాలని పేర్కొన్నారు. పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు 10 జీపీఏ సాధించేలా ప్రణాళిక ప్రకారం సిద్ధం చేయాలని సూచించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనాథ్, ఉపాద్యాయులు, తదితరులు పాల్గొన్నారు.