జగిత్యాల జిల్లా కోర్టు సంచలన తీర్పు
Accused gets 60 years in jail: గొల్లపల్లి, జనవరి 1 (మన బలగం): లైంగికదాడిలో కేసులో సంచలన తీర్పు వెలువడింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని ముగ్గురు బాలికలపై శివరాత్రి ముత్తయ్య అనే వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. అప్పటి ఎస్ఐ నరేశ్ పోక్సో కేసు నమోదు చేయగా తాజాగా నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. విచారణ అనంతరం జిల్లా జడ్జి నీలిమ తీర్పు వెల్లడించారు. నిందితుడికి ఒక్కో కేసులో 20 ఏళ్ల చొప్పున మొత్తం 60 ఏళ్లు జైలు శిక్ష విధించారు.