Dharmapuri: ధర్మపురి, జనవరి 1 (మన బలగం): ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఈనెల 10న శుక్రవారం ముక్కోటి ఏకాదశి మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ మఠం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి, దేవాదాయ శాఖ మంత్రి కొండాసురేఖ, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందజేసినట్లు ఈవో తెలిపారు.