Crowded temples: నిర్మల్, జనవరి 1 (మన బలగం): నిర్మల్ జిల్లాలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అర్ధరాత్రి కేకులను కట్ చేసి మిఠాయిలను పంచుకొని వేడుకలను నిర్వహించుకున్నారు. బుధవారం ఉదయం ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. నూతన సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని కోరుతూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.