- సహకార చట్టం పరిధిలో శ్రీ ధరణి ఎఫ్‌పీవో
- రైతులకు అందుబాటులో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ దుకాణం
input center: మల్యాల, మార్చి 18 (మన బలగం): మల్యాల మండల కేంద్రంలోని సెర్ప్ ఉషోదయ మండల సమాఖ్య భవనంలో శ్రీ ధరణి వ్యవసాయ ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం లిమిటెడ్, ఇన్‌పుట్ సెంటర్ శ్రీ ధరణి ఎఫ్‌పీవో ద్వారా ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సంస్థ రఘువరన్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం డి.ఆర్.డి.ఓ మట్లాడుతూ మహిళలు ప్రభుత్వం అందించే కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ వివిధ కార్యక్రమాలు చేపట్టి మహిళా పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డి.ఆర్.డి.ఓ రఘువరన్, అడిషనల్ డి.ఆర్.డి.ఓ చరణ్ దాస్, తహశీల్దార్ మునీందర్, ఎంపీడీవో స్వాతి, డీపీఎం విజయ భారతి, వెంకటేశం, ఏపీఎం చిన్న రాజయ్య, ఉస్సెన్, వ్యవసాయ అధికారి దీపక్, ఇ.జి.ఎస్ ఏపీవో శ్రీనివాస్, సీసీ క్రిష్ణమోహన్, సీవో లక్ష్మీనారాయణ, యం.ఎస్.ఎ సరిత, ఉషోదయ మండల సమాఖ్య అధ్యక్షులు అంజలి, రేఖ శ్రీ, గంగ, శ్రీధరణి సంస్థ అధ్యక్షురాలు జి.మానస, సి.ఇ.ఒ శ్రీధర్ మరియు పాలకవర్గ సభ్యులు ఎఫ్.పి.సి అధ్యక్షులు వివేకవర్ధిని, మహిళా రైతులు పాల్గొన్నారు.
మహిళలతో నిర్వహణ
మహిళా రైతుల కోసం ఏర్పడి, వారిచే నిర్వహిస్తున్న మహిళా రైతు ఉత్పత్తి సంస్థలను ఎన్ఆర్ఎల్ఎం పథకం ద్వారా చేశారు. దీనిలో మహిళా రైతులు వాటాదారులుగా చేరవచ్చు. ఈ సంస్థ విధివిధానాలు నియమాలను సభ్యులే తయారుచేసుకుంటారు. మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆవశ్యకత ప్రస్తుతం మనమందరమూ పండించిన పంటలను మనకు అందుబాటులో ఉన్న బహిరంగ మార్కెట్లో అమ్మేలా చూస్తారు. పంటకాలము అనగా 3 నుంచి 6 నెలలు కష్టపడితే వచ్చేదానికంటే వ్యాపారస్తుడు పంటను కొని అమ్మడము వలన లాభము పొందుతున్నాడు. కావున మనచేతులో ఉన్నంత వరకైనా మార్పు వలన కొంత అధిక రాబడి పెంచుకోనుటకై ఉత్పత్తిదారుల సంస్థ స్థాపించాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన.
సంఘాలుగా ఏర్పడి
మహిళా రైతు సంఘాల అవశ్యకత మన ప్రయత్నములో మొదటి అడుగుగా ఒక్కొక్కరము చేయలేని పనిని మొదటగా గ్రామములోనున్న కొంతమంది మహిళా రైతులము ఒక సంఘముగా ఏర్పడితే మనము ఎదుర్కొనే సమస్యల గురించి చర్చించు కొనడముతోపాటు అధిక దిగుబడులను సాధించుటకు గల ఆధునిక పద్ధతులతో పాటు మార్కెట్ ద్వార కూడా అధిక ఆదాయము పొందటానికి కృషి చేసే అవకాశము ఉన్నది. మహిళా రైతు ఉత్పత్తి దారుల సంస్థ ఆవశ్యకత ఒక మండలములోనున్న 15 నుంచి 20 గ్రామాలలో నివసించే మహిలరైతులు ఆయా గ్రామాలలో ఏ పంటనైతే అత్యధికంగా పండిస్తున్నారో ఆయాపంటల విత్తనము నుండి అమ్మకమువరకు వివిధ దశలలో అధిక లాభాలు సంపాధించుటకై వారందరూ వారి వారి గ్రామాలలో ఒకే పరిధిలో నివసించే వారు 10 నుండి 20 మంది సభ్యుల వరకు ఒక ఉత్పత్తిదారుల సంఘమగా ఏర్పడినప్పటికీ, ఒక గ్రామ స్థాయిలో సాధించలేని విషయాలను ఒక మండలము లేదా పరిసర గ్రామాలలో ఉన్న వారంధారము కలిసినట్లితే మన పంటలకు అధిక ధర పొందేటందుకు అవకాశమున్నది
ఉదాహరణకు.. ధాన్యాన్ని బియ్యముగా లేదా కందులను పప్పుగా మార్చటము మహిళా రైతు ఉత్పత్తి దారుల సంస్థ (ఎఫ్‌పీవో) నిర్మాణము ఒక గ్రామ స్థాయిలో ఉన్న సభ్యులతో మరియు పండిస్తున్న పంటలతో సాధించనిది వివిధ గ్రామాలలో ఈవిధముగా ఏర్పడిన ఉత్పత్తిదారుల సంఘాలన్నీ దాదాపు 50 నుంచి 70 సంఘాల వరకు 1000 నుంచి 2000 సభ్యులతో మండల స్థాయిలో లేదా పరిసర గ్రామాలలో ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పాటు చేసుకున్నట్లైతే మన సంస్థ ఆధ్వర్యములో రైస్ మిల్ లేదా దాల్ మిల్ ఏర్పాటు చేసుకొనే అవకాశమున్నది. ఇందుకు అవసరమైన నిధులన్నీ సంస్థలో ఉన్న సభ్యులతోపాటు వివిధ ఆర్ధిక సంస్తలనుండి అప్పులు మరియు వివిధ రూపాలలో పొంది సంస్థను అభివృద్ధి చేసుకొని మనమే సమర్తవంతముగా నిర్వహించ టము వలన ఈ సంస్థ ద్వార పొందే ప్రయోజనాలు కూడా సభ్యులమే పొందవచును. ఈ సంస్థను గ్రామ స్థాయి నుండి వచ్చే ఉత్పత్తి దారుల సంఘ ప్రతినిధులనుండి ఉత్పత్తి దారుల సంస్థ పాలకవర్గ ముగా ఎన్నిక కాబడి ఈ సంస్థ కార్యకలాపాలను నిర్వహించెదరు.
ఉత్పత్తిదారుల సంస్థ ద్వారా పొందే సేవలు
1. రైతులు తమ ఆదాయం మెరుగు పరచుకోనుట
2. సాముహిక విత్తన మరియు ఎరువుల సేకరణ, తక్కువ పెట్టుబడి పద్దతులను అవలంభించుట వలన పంటల ఖర్చులను తగ్గించుట.
3. ఉద్పాదకత పెంచు వివిధ పద్ధతుల అనుసందానము ద్వారా దిగుబడి పెంచుట.
4. పంటల అమ్మకమునకు గిట్టుబాటు ధర అధికము చేయుట.
5. రైతులలో స్వయం సహాయము మరియు పరస్పర సహాయములను అభివృద్ధి పరచుట.
సభ్యుల ప్రయోజనములు
1. సరైన కాలములో సులభముగా నాణ్యతగల విత్తనములు, ఎరువులు మరియు కీటకనాశన మందులు యంత్రపరికరములు సరైన సమయములో మరియు సరసమైన ధరలకు పొందుట.
2. పంటల ఉత్పత్తులను సంస్థ ద్వారా కొనుగోలుచేసి గిట్టుబాటు ధరలకు అమ్మి ఆదాయాన్ని పెంపొందించుట.
3. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల అనుసంధానముతో పనిచుయుటవలన వ్యవసాయ సంభంధిత సహయాములు, సలహాలు, సూచనలు, పథకములు సులభమైన రీతిలో పొందుట.
4. సామూహిక వ్యవసాయ పనిముట్ల సేవ కేంద్రం మరియు గిడ్డంగులు, శీతల గిడ్డంగులు సదుపాయము ద్వార లబ్ది పొందుట.
5. కంపెనీలో ఉండే సభ్యుల సరుకు ఎక్కువగా ఉండటము వలన బేరమాడు శక్తి పెరిగి గిట్టుబాటు ధర పొందుట
