Celebrations: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, మార్చి 18 (మన బలగం): రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో బీసీ సెల్ మండల అధ్యక్షులు నందగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం శాసనసభలో బిల్లు ఆమోదం తెలుపడంతో కాంగ్రెస్ నాయకులు టపాకాయలు కాల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చడం చాలా సంతోషకరమని, బీసీల తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాములు నాయక్, వైస్ చైర్మన్ లక్ష్మణ్, మండల అధ్యక్షులు శ్రీనివాస్, యూత్ మండల అధ్యక్షులు తిరుపతి, డైరెక్టర్లు చంద్ర మౌళి, శ్రీనివాస్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రవీందర్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు ప్రకాష్ నాయక్, మండల సీనియర్ నాయకులు జోగుల కాంతయ్య, లచ్చిరాం, రవి, సంతోష్ నాయక్, సంజీవ్,కుమార్ తదితరులు పాల్గొన్నారు.