hero Srikanth: ధర్మపురి, డిసెంబర్ 1 (మన బలగం): ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ ఆదివారం వేములవాడ రాజరాజేశ్వరస్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి, ధర్మపురి లక్ష్మీ నర్సింహస్వామివారిని దర్శించుకున్నారు. హీరో శ్రీకాంత్‌కు ఆలయాలలో ఘన స్వాగతం లభించింది. అనంతరం స్వామివారిని దర్శించుకొని ఆలయాల్లో మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి చిత్రపటాలు, ప్రసాదం అందజేశారు. వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. హీరో శ్రీకాంత్ వెంట దర్శకుడు చంద్రకాంత్, నిర్మాత విజయ్ ఉన్నారు. మొదట వేకువజామున ఎములాడ రాజన్నను దర్శించుకున్నారు. అనంతరం కొండగట్టుకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సన్నిధికి చేరుకొని స్వామివారిని దర్శించుకొన్నారు. సాయంత్రం హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు.
తెలంగాణ / ఆరాధన / తాజా వార్తలు