Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయిన జానీ మాస్టర్ రెండు వారాలుగా చంచల్‌గూడా జైలులో ఉన్నారు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని ఆయన వద్ద పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నార్సింగ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆయనపై పొక్సో చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. ఆయన కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు గోవాలో ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు. ఆయనను కోర్టులో హాజరు పరిచారు. మొదటగా ఈ నెల 6 నుంచి9వ తేదీ వరకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గడువు ముగియడంతో తిరిగి జైలుకు వెళ్లారు. రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలుచేయగా తాజా హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. నేటి సాయంత్రం వరకు జానీ మాస్టర్ బెయిల్‌పై విడుదల కానున్నారు.