collector congratulated the lead bank manager: నిర్మల్, అక్టోబర్ 21 (మన బలగం): జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంగోపాల్ ను అభినందించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.అటల్ పెన్షన్ యోజన పథకం 2023-24 సంవత్సరంలో జూలై, సెప్టెంబర్ నెలల మధ్య త్రైమాసికంలో జిల్లాలోని అన్ని బ్యాంకుల ద్వారా 2000 పైగా దరఖాస్తులు స్వీకరించి లక్ష్యాన్ని పూర్తి చేసినందుకుగాను, కేంద్ర ప్రభుత్వపు పిఎఫ్ఆర్ డీఎ నుంచి అవార్డ్ ఆఫ్ ఎక్సిలెన్స్ ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం కలెక్టరేట్ లోని తన చాంబర్లో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ కు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేసి అవార్డు పొందినందుకుగాను జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ ను అభినందించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరే విధంగా మరింత ఉత్సాహంతో పనిచేసి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించి, శుభాకాంక్షలు తెలియజేశారు.