Nude video call to MLA: తెలంగాణలో మరో హనీట్రాప్ ఘటన వెలుగుచూసింది. ఈ సారి ఏకంగా ఎమ్మెల్యేను ట్రాప్ చేసేందుకు స్కెచ్ వేశారు. అప్రమత్తమైన సదరు ఎమ్మెల్యే సబర్‌క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు ఈ నెల 14వ తేదీన గుర్తుతెలియని నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయగా ఓ యువతి న్యూడ్‌గా కనిపించడంతో ఖంగుతిన్న ఎమ్మెల్యే వెంటనే కాల్ కట్ చేశాడు. అలర్ట్ అయిన ఎమ్మెల్యే వెంటనే సబైర్ క్రైమ్ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఇటీవల కాలంలో హనీట్రాప్ ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. న్యూడ్ వీడియో కాల్స్ రికార్డ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారు. లేదంటే సోషల్ మీడియో వీడియో వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు గురిచేస్తుంటారు. బాధితులు తమ పరువు పోకూడదని వారు డిమాండ్ చేసిన డబ్బులు చెల్లిస్తారు. న్యూడ్ వీడియోకాల్ ఘటనపై ఎమ్మెల్యే స్పందిస్తూ తనపై కుట్ర పన్నేందుకు ఎవరైనా ఇలా చేశారని అనుమానిస్తున్నారు. తన పరువు, ప్రతిష్టలు దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు బ్లాక్ మెయిల్‌కు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.