Graduation Day: నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొండాపూర్ గ్రామ శివారులో గల సెయింట్ థామస్ హైస్కూల్‌లో అప్పర్ కిన్నెర్ గార్డెన్ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. గౌన్లు, టోపీలు ధరించిన ‘చిన్న గ్రాడ్యుయేట్లు’ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మనసులను కట్టిపడేశారు. ఈ వేడుక ప్రార్థన నృత్యం మరియు జ్ఞానం, అభివృద్ధిని సూచించే దీపప్రజ్వలనతో ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రిన్సిపాల్ సెబాస్టియన్ అబ్రహం మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను కొనియాడారు. ఈ గ్రాడ్యుయేషన్ కేవలం ఓ కార్యక్రమం కాదని, ఇది నేర్చుకునే ప్రక్రియ అని, అభివృద్ధి మరియు ప్రకాశవంతమైన భవిష్యత్తు ఆరంభానికి ఒక ఉత్సవం అని ఆయన అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సెబాస్టియన్ అబ్రహం, వైస్ ప్రిన్సిపాల్ జోసెఫ్, కే.జీ ఇన్‌చార్జి ఎస్.సుచిత, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు నిరంతర సహకారం మరియు మార్గనిర్దేశానికి ధన్యవాదాలు తెలిపారు.
