road accident: పెద్దపల్లి జిల్లా కేంద్రం సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రంగంపల్లి వద్ద వేకువజామున కారు వేగంగా వచ్చి నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు మహిళలను ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతాగాత్రురాలిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారు పెద్దపల్లిలోని ఉదయనగర్‌కు చెందిన అమృత, భాగ్యలుగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.