Keesaragutta: రోమ రోమాన రామనామం.. అణువణువూ రామభక్తి.. అనుక్షణం రామకీర్తనలతో ఆ శ్రీరాముడికి నమ్మిన బంటు అయ్యాడు అంజన్న. మదినిండా రామయ్య నామస్మరణతో భక్తాగ్రేసరుడు అయ్యాడు హనుమయ్య. భక్తిలో తనకు సాటిలేరని చాటి చెప్పిన వాయుపుత్రినికి ప్రతిరూపంగా నిలిచింది ఈ వానరం. భక్తి తన్మయత్వంతో తరించిపోయింది. శివలింగానికి శిరస్సు వంచి నమస్కరించింది ఓ వానరం. ఈ అపురూప భక్తి కావ్యానికి వేదికైంది కీసరగుట్ట. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసరుగుట్టలో రామలింగేశ్వరస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగాన్ని శరణు వేడింది ఓ వానరం. సోమవారం స్వామిని దర్శించుకున్న భక్తులు ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగాలకు పూజలు చేసి పూలతో అలంకరించారు. అదే సమయంలో ఓ కోతి వచ్చి శివలింగానికి నుదురును ఆనించి మొక్కిన దృశ్యం భక్తులను ఆకట్టుకుంది. కోతి చేష్టలు చేయకుండా భక్తి వినమ్రతతో శివలింగానికి దండం పెట్టింది.
తెలంగాణ / ఆరాధన / తాజా వార్తలు