Polasa Agricultural College: జగిత్యాల ప్రతినిధి, ఫిబ్రవరి 23 (మన బలగం): క్రీడలు యూనివర్సిటీ ఉద్యోగులలో శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని రిజిస్ర్టార్ డాక్టర్ జి.ఈ.సి.హెచ్ విద్యాసాగర్ అన్నారు. ఆదివారం పొలాస వ్యవసాయ కళాశాలలో యూనివర్సిటీ స్థాయి బోధనేతర సిబ్బందికి మూడు రోజుల పాటు నిర్వహించే క్రీడలను రిజిస్ర్టార్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ బోధనేతర సిబ్బంది క్రీడలకు జగిత్యాలలోని పొలాస వ్యవసాయ కళాశాల వేదిక కావడం ఎంతో సంతోషకరమన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ పోటీలు ఉద్యోగులలో స్నేహపూరిత వాతావరాణాన్ని కల్పిస్తుందన్నారు. ఒక్కో జోన్‌లో 35 చొప్పున 175 మంది బోధనేతర సిబ్బంది, ఉద్యోగులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. స్థానిక నార్తన్ తెలంగాణ జోన్ (జగిత్యాల ), రాజేంద్రనగర్ జోన్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ జోన్, సెంట్రల్ తెలంగాణ జోన్ (వరంగల్ ), సౌతన్ తెలంగాణ జోన్ (పాలెం) జట్లు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. ఈ టోర్నీలో క్రికెట్, వాలిబాల్, టేబుల్ టెన్నిస్, రన్నింగ్, జావలిన్, క్యారమ్స్, షటిల్, బాల్ బ్యాట్మెంటిన్ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు.
ఇలాంటి క్రీడాలతో ఉద్యోగుల మధ్యలో మంచి సంబంధాలు ఏర్పడి ఎందరికో ప్రయోజనం జరిగితుందన్నారు. ఈ పోటీలకు వేదికైన జగిత్యాల పొలాస వ్యవసాయ కళాశాల డీన్, సిబ్బంది క్రీడల నిర్వహణకు చేసిన ఏర్పాట్లు ఎంతో అభినందనీయమన్నారు. ఈ టోర్నీలో పాల్గొనే ఉద్యోగ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరచాలని విద్యా సాగర్ కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్ డాక్టర్ భారతి నారాయణ బట్, పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ డి.శ్రీలత, పరిశీలికులు డాక్టర్ జె.సురేష్, యూనివర్సిటీ బోధనేతర సిబ్బంది అధ్యక్షులు శ్రీనివాస యాదవ్, ఉపాధ్యక్షులు పి.మహేష్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ జహంగీర్, జాయింట్ సెక్రటరీ జయరాం, కళాశాల ఓఎస్ఏ డాక్టర్ ఎన్.మహేష్, కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి.వెంకట గణేష్ పాల్గొన్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా బోధనేతర సిబ్బంది వివిధ డ్రెస్‌కోడ్‌లలో మార్చ్ ఫాస్ట్ నిర్వహించి వ్యవసాయ గీతాలాపన, జ్యోతి ప్రజ్వలన, క్రీడా స్ఫూర్తిని నింపేందుకు ప్రతిజ్ఞ నిర్వహించారు. తర్వాతి కార్యక్రమంలో వాలీబాల్, క్రీడా పోటీలను నిర్వహించి రిజిస్టర్ ప్రత్యేక అభినందనలను క్రీడాకారులకు తెలియజేశారు. తర్వాత కార్యక్రమంలో రిజిస్ర్టార్ వ్యవసాయ కళాశాల బాలుర వసతి గృహం సందర్శించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.