CPI Karimnagar: కరీంనగర్, మార్చి 23 (మన బలగం): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అనునిత్యం పోరాడే పార్టీ సిపిఐ అని కసిరెడ్డి సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. సిపిఐ మారుతీ నగర్ శాఖ సమావేశం గామినేని సత్తయ్య అధ్యక్షతన హౌసింగ్ బోర్డ్ చౌరస్తాలో జరిగింది. చౌరస్తాలో ఏర్పాటుచేసిన సిపిఐ పతాకాన్ని సురేందర్ రెడ్డి ఎగరవేశారు. ఈ సందర్భంగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ సిపిఐ పార్టీ ఆవిర్భవించి వందేళ్లు గడిచిందని గత వందేళ్లుగా పార్టీ అనేక ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసి ప్రజా సమస్యల పరిష్కారం కి కృషి చేసిందని ఆయన తెలిపారు. కరీంనగర్ నగరంలో ఉన్న అనేక సమస్యలపై సమరశీల పోరాటాలు చేసిన పార్టీ సిపిఐ అని నగరంలో వేలాదిమందికి ఇండ్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చిన పార్టీ అని రేషన్ కార్డులు, వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ల కోసం అనేక పోరాటాల్లో ప్రజలను భాగస్వామ్యం చేసి పెన్షన్లను సాధించిన ఘనత సిపిఐకే దక్కుతుందన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్ నగరంలో స్మార్ట్ సిటీ పేర కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని గత ప్రభుత్వ హయంలో జరిగిన అవినీతి పై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
మారుతీ నగర్లొ డ్రైనేజీ సమస్య ఉందని ఎప్పుడు పాతకాలపు డ్రైనేజీలు ఉండడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. సిపిఐ నగర సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు మాట్లాడుతూ మారుతి నగర్, హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలో డంపు యార్డ్ నుండి వచ్చే గాలి వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలతో గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత మున్సిపల్ పాలకవర్గం, బిఆర్ఎస్ ప్రభుత్వంలో నగరంలోని ప్రజలకు 24 గంటల నల్లా నీరు ఇస్తామని మాయ మాటలు చెప్పారని నేటికీ 24 గంటల నల్లా నీరు సౌకర్యాన్ని కల్పించకపోవడం గత పాలకుల చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు. గత పాలకవర్గ హయాంలో జంక్షన్ల ఆధునీకరణ పేరా కోట్ల రూపాయలు పందికొక్కుల తిన్నారని దీనిపై విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత మేయర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనుల పేరా జరిపిన అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి అక్రమ ఆస్తులను లాక్కోవాలని అన్నారు. ఈ శాఖ సమావేశంలో తోట కృష్ణయ్య, నాంపల్లి శంకర్, శ్రీనివాస్,నగునూరి రమేష్,మొహమ్మద్ ఆరిఫ్, కొట్టే రమేష్, కే రవి తోటస్వామి,డి రాజు,నానవేణి రాజు, తిరుమల స్వామి, నరసయ్య,రమేష్, కలీం సతీష్ తదితరులు పాల్గొన్నారు.
