Basara Circle CCF: నిర్మల్, మార్చి 8 (మన బలగం): మహిళలు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించాలని బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శర్వానంద్ అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ అటవీ కార్యాలయంలో మహిళల విశ్రాంతి గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మహిళ ధైర్యంగా ముందుకొచ్చినప్పుడే ఆర్థిక స్వాలంబన సాధించగలుగుతుందని అన్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అధికారులు నిర్మల్ అటవీ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ డీఎఫ్‌వో నాగిని భాను, నిర్మల్ జిల్లా అటవీ అధికారులు రామకృష్ణ, వేణుగోపాలరావు, గీతారాణి, డిప్యూటీ రేంజ్ అధికారులు నజీర్ ఖాన్, సంతోష్ కుమార్, జిల్లాలోని మహిళా అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.