Guess: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (ys rajasekhara reddy) 75వ జయంతి నేడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ బంజారాహిల్స్ సిటీ సెంటర్‌లో వైఎస్ఆర్ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, రాష్ర్ట ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, కేవీపీ రామచంద్రరావు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు హాజరయ్యరు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ర్టంలో అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డే స్ఫూర్తి అని తెలిపారు. వైఎస్ పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని గుర్తుచుశారు. ఇటీవల రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రల ఫలితంగా పలు రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా 35 కార్పొరేషన్లకు చైర్మన్‌లను నియమించామని చెప్పారు. ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ ఫొటో గ్యాలరీను ప్రదర్శించారు.
#ysrjayanti #revanthreddy pic.twitter.com/qKpPVe77io
— manabalagam (@manabalaga30639) July 11, 2024