medical camp: ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 28 (మన బలగం): కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కేశాపూర్ గ్రామంలోని మున్నూరు కాపు కులస్తులకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఇబ్రహీంపట్నం ఏఎంసీ చైర్మన్ బొరిగెం రాజు ప్రారంభించారు. ఈ శిబిరంలో 120 మందికి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి షుగర్, బీపీ, 2డీ ఎకో పరీక్షలు చేసి రోగనిర్ధారణ చేశారు. ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ మున్నూరు కాపు కులస్తులతో పాటు మారుమూల గ్రామీణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెడికవర్ ఆసుపత్రిలో 24 గంటలపాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ శిబిరంలో మాజీ సర్పంచ్ నల్ల మీనా రమేశ్, నల్ల రామరాజు మున్నూరుకాపు, యువజన సంఘం అధ్యక్షులు దాసరి పెద్ద నర్సయ్య, గూడ శ్రీకాంత్ రెడ్డి, చల్లా పురుషోత్తం, మెడికవర్ మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, దాసరి చంద్రశేఖర్, శ్రీధర్, అనంత్, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.