National Voter’s Day: నిర్మల్, జనవరి 25 (మన బలగం): భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు అంజి కుమార్ రెడ్డి అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి మాట్లాడుతూ 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క యువకులు ఓటు హక్కును వినియోగించుకోవాలని భారత రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకొని ప్రభుత్వం ఏర్పాటులో భాగస్వామ్యం కావాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో దేశ అభివృద్ధి కొరకు పాటుపడే వ్యక్తులను ఎన్నుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పార్లమెంటు కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘటన పరువు జిల్లా కన్వీనర్ సామ రాజేశ్వర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి గుడిపల్లి శ్రావణ్, అసెంబ్లీ కన్వీనర్ శ్రీగాదె విలాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అయ్యన్నగారి రాజేందర్ సీనియర్ నాయకులు రచన మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.