Telangana Armed Farmers Struggle Commemoration in Tarlapad: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని తర్లపాడ్‌లో ఆదివారం తెలంగాణ రైతంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి పోరాటం యోధులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా నాయకులు నాగేల్లి నర్సయ్య మాట్లాడుతూ, కొందరు చెప్తున్నట్టు మతాల మధ్య పోరాటం కాదని, ఇది ఒక వర్గ పోరాటం అని, నిజాం రాజు-భూస్వాముల వర్గానికి, రైతులు కూలీలకు మధ్య జరిగిన పోరాటం అని తెలిపారు. హింస, వెట్టి చాకిరీ, అణచివేత నుంచి పుట్టిన చైతన్యమే తెలంగాణ సాయుధ పోరాటం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు బోసు భూమన్న, కలమడుగు రాజన్న, ఎల్లేశ్వరం లక్ష్మి, మసీదు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.