BJLP leader Eleti Maheshwar Reddy: నిర్మల్, జనవరి 16 (మన బలగం): సారంగాపూర్ మండలం బండరేవు తండా లో ప్రసిద్ధ నాను మహారాజ్ జాతర ఉత్సవాల్లో ఎమ్మెల్యే బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. గిరిజన సోదరుల ఆరాధ్య దైవం నాను మహారాజ్ ఆలయాన్ని దర్శించుకోవడం, జాతర ఉత్సవాల్లో పాల్గొనడం అనందగా ఉందన్నారు. రాబోవు రోజుల్లో ప్రతీ గిరిజన మూరుమూల గ్రామానికి కనీస సౌకర్యాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాను మహారాజ్ జాతర ఉత్సవాల్లో భాగంగా పలు క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు. పోటీలో గెలిచిన క్రీడా కారులకు అభినందనలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఎమ్మెల్యే ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు, మండల నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.