BRS development foundations, Congress false claims in Khanapur
BRS development foundations, Congress false claims in Khanapur

BRS development foundations, Congress false claims in Khanapur: బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పునాదులపైనే కొత్తగా పనులు

BRS development foundations, Congress false claims in Khanapur: నాడు బీఆర్ఎస్ హయాంలో జరిగిన సంక్షేమ పథకాలకు శంకస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తూ గొప్పలు చెప్పుకొంటున్నారని పలువురు బీఆర్ఎస్ నాయకులు విమర్చించారు. సోమవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాతపనులకు పూతలు పూయడం సిగ్గుచేటని, కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యే చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. ఖానాపూర్ మండలంలోని రాజురా గ్రామంలో ప్రారంభించిన బస్తీ దవఖానా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగిన పని అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న దూరదృష్టి నిర్ణయాల వల్లే అంగన్వాడీ సెంటర్లు, బస్తీ దవఖానాలు అని ఇలా ఎన్నో పనులు చేసిన ఘనత కేసీఆర్‌దే అని, నేడు అవే అభివృద్ధి పనులు మాత్రమే ఉన్నాయని అన్నారు.

ఆధునిక సదుపాయాలతో ముందుకు వెళ్తున్నాయని, రాజురా నుంచి పెంబి రోడ్డు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని, ప్రజల సొమ్ముతో జరిగే పనులను తన వ్యక్తి గతగా చూపించుకోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైందని, ఎటువంటి కొత్త అభివృద్ధి పనులు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన పునాదుల మీదే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఫొటోలు దిగుతూ క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నీ మరచి, కేవలం తూతూ మంత్రంగా పర్యటనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్న అధికార పార్టీ నాటకాలకు ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, అభివృద్ధి కన్నా ప్రచార యాత్రలకే ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అసలైన వైఖరిని బయటపెడుతోందని, ఇకనైనా తమ బుద్ధి మార్చుకొని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాజురా గ్రామ మాజీ ఉప సర్పంచ్ లింగన్న, నాయకులు షకీర్, గడ్డం శ్రీను, పెద్ది రాజు, బద్దిరాజు, నర్సయ్య, చందు, రామారావు, భీమేశ్, మదన్, లడ్డూ యాదవ్, వినోద్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *