Preservation of Tribal Culture and Traditions for Future Generations
Preservation of Tribal Culture and Traditions for Future Generations

Preservation of Tribal Culture and Traditions for Future Generations: గిరిజన సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు అందించాలి: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్

Preservation of Tribal Culture and Traditions for Future Generations: గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు అందరికీ ఆదర్శం అని, వాటికి సంబంధించిన రచనలు, పుస్తకాలను భావి తరాలకు అందించేలా చూడాల్సిన బాధ్యత ఉందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. వాటిని భవిష్యత్ తరాలకు అందించేలా వాటిని మాతృ భాషలోకి అనువదించి భద్రపరచాలి కోరారు. బుధవారం హైద్రాబాద్‌లోని గిరిజన సంక్షేమ శాఖ వారిచే నిర్వహిస్తున్న గిరిజన సాంస్కృతిక పరిశోధన-శిక్షణ సంస్థను సందర్శించారు. అందులో ఉన్న రచనలు, పుస్తకాలను పరిశీలించారు. హైమన్ డార్ఫ్ అనే రచయిత గిరిజనుల గురించి, గిరిజనుల సంస్కృతి జీవన విధానాలు గురించి రచించిన ‘ది రాజ్ గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్’ అనే పుస్తకం చదివి ముగ్ధుడై భావితరాలకు ఈ రచనలు, ఈ జ్ఞాన సంపద అందించేలా వాటిని స్థానిక భాషల్లోకి అనువదించి భద్రపరచాలి అని అధికారులను ఆదేశించారు. మన సంస్కృతి, జీవన విధానాలు భవిష్యత్ తరాలకు ఆదర్శం అని పేర్కొన్నారు. లైబ్రరీలో ఉన్న గిరిజన కళాకృతులు, పెయింటింగ్‌లను పరిశీలించి వాటి అమ్మకాలు ఎలా జరుగుతున్నాయని అడిగి తెలుసుకొన్నారు. ప్రజలకు చేరువ చేసే విధంగా గిరిజన ఉత్పత్తుల గురించి విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని కోరినట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *