Start of grain purchase centers: ధర్మపురి, అక్టోబర్ 28 (మన బలగం): గొల్లపెల్లి మండలం శకరపట్నం, వెంగళాపూర్ గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు, మండల నాయకులతో కలిసి సోమవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.