Invitation to Nirmal and Mudhol MLAs: నిర్మల్, నవంబర్ 9 (మన బలగం): నిర్మల్ పట్టణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 84 వ శ్రీ వైష్ణవ ఆయుత చండి, అతిరుద్ర హోమానికి రావాల్సిందిగా నిర్మల్ ఎమ్మెల్యే, శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేళ్లను నిర్వహణ కమిటీ ఆహ్వానించింది. ఈ మేరకు శనివారం చండీ హోమ వివరాల ప్రతిని అందజేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో దివ్యనగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పురస్తు శంకర్, నాయకులు మహేందర్ రెడ్డి, ఆహ్వాన కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.