Potti Sriramulu vardhanti: మెట్‌పల్లి, డిసెంబర్ 15 (మన బలగం): మెట్‌పల్లి పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకల సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మైలారపు లింబాద్రి వర్ధంతి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఇక్కడ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మైలారపు రాంబాబు కార్యదర్శి ఎల్మీ రవి, సంయుక్త కార్యదర్శి కొత్త నవీన్, వాసవి దేవాలయం అధ్యక్షులు చాడ సురేశ్, వాసవి గార్డెన్ అధ్యక్షులు కోట కిరణ్, వాసవి విద్యా కమిటీ అధ్యక్షులు పడిగల శ్రీనివాస్, కార్యదర్శి బండారి శివ, యువజన సంఘం అధ్యక్షులు చకినం కేదార్నాథ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పుల్లూరి నవీన్ కుమార్, జొన్న శ్రీనివాస్, పామపొట్టి అరుణ్, కట్కం శంకర్ తదితరులు ఉన్నారు.