Har Gar Tiranga Rally: నిర్మల్, ఆగస్టు 12 (మన బలగం): నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మంగళవారం హర్ గర్ తిరంగా ర్యాలీనీ ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ అధికారి డాక్టర్ బి.ఉమేశ్ మాట్లాడుతూ.. ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించడానికి, భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మరింత ఘనంగా జరుపుకోవడానికి ఈ ర్యాలీ దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థులు మరియు సిబ్బంది ఉత్సాహంతో పాల్గొని, ప్రతి ఇంటిలో జాతీయ జెండాను ఆవిష్కరించాలని సూచించారు. ప్రజలకు ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.సుధాకర్, డా.యు.గంగాధర్, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.