ఎమ్మెల్యే సంజయ్ కుమార్
MLA Sanjay Kumar: నిరుపేదలకు నీడను ఇచ్చేది వాల్మీకి ఆవాసంలోనే అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. దరూర్ క్యాంప్ లోని ఆవాసం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపి అర్వింద్ తోపాటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు పేద పిల్లల పక్షాన నిలిచి వారి అభివృద్ధికి ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవ చేస్తూ వారి ఉన్నతికి కృషిచేసిన వాల్మీకి ఆవాస సభ్యులందరికీ జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. వాల్మీకి ఆవాసానికి గత రెండు దశాబ్దల కాలం నుండి తనకు సన్నిహిత సంబంధం ఉంది. అనేక కార్యక్రమాలకు ఇక్కడికి రావడం జరిగింది. నిజామా బాద్ ఎంపీ అరవింద్ ను జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా జగిత్యాలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కి నిదులు మంజూరు చేయాలని, రహదారులు, వంతెనల ఏర్పాటుకు నిదులు మంజూరు చేయాలని కోరుతున్న, వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగిందన్నారు. భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ అని, ప్రథమ స్థానం లో ఉన్న వాల్మీకి ఆవాసం కి అందరి పక్షాన అభినందనలు అని అన్నారు.