Awareness of cyber crimes: నిర్మల్, నవంబర్ 5 (మన బలగం): సైబర్ క్రైమ్స్ పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని షీటీం ఎస్సై సుమాంజలి అన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని వైద్య కళాశాలలో షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్, డయల్ 100, ఈవ్ టీజింగ్ తదితర విషయాలను విద్యార్థులకు వివరించారు. సైబర్ నేరాలతో పాటు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వినియోగంతో తలెత్తే దుష్పరిణామాలను వివరించారు. కార్యక్రమంలో వైద్య కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.