Jitender Reddy preview show in Jagityal
Jitender Reddy preview show in Jagityal

Jitender Reddy preview show in Jagityal: జగిత్యాలలో జితేందర్ రెడ్డి ప్రివ్యూ షో

Jitender Reddy preview show in Jagityal: జగిత్యాల, నవంబర్ 5 (మన బలగం): నక్సలైట్ల చేతుల్లో మరణించిన జగిత్యాల ప్రాంతానికి చెందిన ముదుగంటి జితేందర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కించిన జితేందర్ రెడ్డి సినిమా ప్రివ్యూ షోకు భారీ స్పందన కనిపించింది. స్థానిక బాలాజీ థియేటర్‌లో ఈ సినిమాను ప్రదర్శించగా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఈ సినిమాను జితేందర్ రెడ్డి బాల్యమిత్రులు, అభిమానులు, ఏబీవీపీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు తిలకించారు. 1980 దశకంలో నక్సలైట్లను ఎదిరించి జాతీయవాదాన్ని బలంగా చాటిచెప్పి వారి చేతిలోనే అమరుడైన జితేందర్ రెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమాను ఆయన సోదరుడు ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మించారు. ఈనెల 8న ఈ సినిమా విడుదల కానుంది. సినిమా ప్రివ్యూ షో సందర్భంగా జగిత్యాల పట్టణంలో జితేందర్ రెడ్డి అభిమానులు, బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలు బాణాసంచా పెల్చుతూ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల పట్టణంలో నిర్వహించిన ఈ ర్యాలీ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *