Opening of purchase centers: ఇబ్రహీంపట్నం, నవంబర్ 5 (మన బలగం): కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని యమాపూర్ సహకార సంఘ చైర్మన్ అంకతి రాజన్న అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని యామాపూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో యామపూర్, వేములకుర్తి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ బోరిగాం రాజు, స్థానిక నాయకులు, రైతులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాలలో తాము పండించిన వరి ధాన్యాన్ని విక్రయించి గిట్టుబాటు ధర పొందాలన్నారు. ప్రభుత్వం క్వింటాలు వరికి ఏ గ్రేడ్ రకం 2,320, క్వింటాలు వరిధాన్యం బీ గ్రేడ్ రకానికి రూ.2300కు విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆకు రాజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడ శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలాల వెంకటరెడ్డి, విండో వైస్ చైర్మన్ అరె గంగారెడ్డి, డైరెక్టర్లు పల్లె నాగేష్, దోనికెన రాజేష్,గుజ్జే గంగాధర్, గడ్డం శంకర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ గుమ్మల రమేష్, నాయకులు క్యాతం తిరుపతి రెడ్డి, పోతరాజు శివరాజం, కాశిరెడ్డి బస్కార్ రెడ్డి, దేశెట్టి రాజారెడ్డి, పెంట లింబాద్రి, రాధారపు దేవదాస్, వెల్పుల శ్రీనివాస్, మెర్తాడ్ గంగారెడ్డి, సహకార సంఘం సీఈవో నేమురి మహేందర్ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.