రెండు రోజులుగా చికిత్స పొందుతున్న బాధితులు
One died of food poisoning: నిర్మల్, నవంబర్ 5 (మన బలగం): నిర్మల్ జిల్లా కేంద్రంలోని గ్రిల్ 9లో ఈ నెల 2న కలుషితాహారం తిని చికిత్స పొందుతున్న వారిలో మధ్యప్రదేశ్‌కు చెందిన పూల్‌కలి బైగా(19) అనే యువతి మంగళవారం మృతి చెందింది. బోథ్‌కు చెందిన సెయింట్ థామస్ సిబ్బంది ఈ నెల 2న నిర్మల్‌కు వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చారు. చీకటి పడటంతో పట్టణంలోని గ్రిల్9లో చికెన్ భోజనం చేసి తిరిగి వెళ్లారు. అదే రోజు రాత్రి నుంచి పాఠశాలకు చెందిన ఐదుగురికి వాంతులు విరేచనాలు మొదలయ్యాయి. మరుసటి రోజు బోథ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చికిత్స కోసం వెళ్లిన క్రమంలో వైద్యులు ఫుడ్ పాయిజన్‌గా నిర్ధారించారు. అప్పటి నుంచి మందులు వాడుతున్నా తగ్గకపోగా మంగళవారం పూల్‌కలి బైగా మృతి చెందింది. ఈ మేరకు పాఠశాల ప్రిన్సిపాల్ స్మిత పోలీసులకు ఫిర్యాదు చేశారు.