Nirmal Collector: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎన్‌డిఆర్ఎఫ్ సిబ్బందికి సూచించారు. మంగళవారం సాయంత్రం స్థానిక గండి రామన్న సమీపంలోని ఫంక్షన్ హాల్‌లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కలిసి భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ పలు సూచనలు చేశారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు వరదల కారణంగా ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు అందినా, వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది యొక్క బోట్లు, లైఫ్ జాకెట్లు, తదితర సామగ్రిని పరిశీలించి అధికారులకు ఆమె పలు కీలక సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.