Nandi Award: ధర్మపురి, జనవరి 8 (మన బలగం): ధర్మపురి పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు భోగ శివప్రసాద్‌ను గానకోకిల కళానికేతన్ వారు నంది పురస్కారంతో సన్మానించారు. జిల్లా కేంద్రమైన జగిత్యాలలో గాన కోకిల కళానికేతన్ 32వ వార్షికోత్సవ వేడుకల్లో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన పలువురికి నంది పురస్కారస్కారాన్ని జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి ప్రదానం చేసారు. ఇందులో భాగంగా వ్యాఖ్యాతగా అనేక కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా పేరు గడించిన భోగ శివప్రసాద్‌కు ‘వ్యాఖ్యానంలో నంది పురస్కారం’ లభించింది. గతంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు, జాతీయ కళారత్న అవార్డు పొంది, నేడు నంది అవార్డు అందుకున్న భోగ శివప్రసాద్‌ను పలువురు అభినందించారు.