Nirmal Collector
Nirmal Collector

Nirmal Collector: విద్యార్థుల్లో పఠనాసక్తి పెరుగుతుంది.. కలెక్టర్ అభిలాష అభినవ్

Nirmal Collector: బాల సాహిత్య పుస్తకాల వలన విద్యార్థుల్లో పుస్తకపఠనాసక్తి పెరుగుతుందని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో రూమ్ టూ రీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంచార పుస్తక వాహనాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. సంచార వాహనంలో చదవడానికి అందుబాటులో ఉంచిన పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఈ వాహనం పాఠశాలలు, అంగన్వాడీలు, గ్రామాలలోని ముఖ్య కూడళ్ల వద్ద పుస్తక పఠనంపై అవగాహన కల్పిస్తుందన్నారు. ప్రతి విద్యార్థి పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని, విద్యానైపుణ్యాలు పెంచుకోవాలని కోరారు. విద్యార్థుల పుస్తక పఠన సామర్థ్యం పెంచడానికి కృషి చేస్తున్న రూమ్ టూ రీడ్ సంస్థను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, డీఆర్వో భుజంగ్ రావ్, డీఈఓ రవీందర్ రెడ్డి, రూమ్ టు రీడ్ జిల్లా ఇన్‌చార్జి రవి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *