donation: ఇబ్రహీంపట్నం, మార్చి 5 (మన బలగం): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ లైన్ ఇన్‌స్పెక్టర్ చింతకింది హనుమంత్ ప్రసాద్ తన పెన్షన్ నుంచి 1 లక్ష రూపాయలు ఇటిక్యాల నివేదిత వృద్ధాశ్రమం కొరకు విరాళం అందించారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు హనుమంత్ ప్రసాద్, జమున దంపతులను అభినందించారు. ఇలాంటి ఉద్యోగులు అరుదుగా ఉంటారని, ఉద్యోగాలు చేసి జీవితంలో మంచిగా స్థిరపడిన ఉద్యోగులు ప్రసాద్‌ను ఆదర్శంగా తీసుకొని వృద్ధులు, అనాథల సంక్షేమం కొరకు పాటుపడితే గొప్ప సంతృప్తి లభిస్తుందని తెలిపారు. ఇదే పరిపూర్ణ మానవత్వం అని కొనియాడారు. కార్యక్రమంలో ఏడీఈ మనోహర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రావు, సురభి భూమరావు, సుఖేందర్ గౌడ్, ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.