Rooms for police dogs
Rooms for police dogs

Rooms for police dogs: నేరస్తుల అన్వేషణలో పోలీస్ జాగిలాల పాత్ర కీలకం: జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

Rooms for police dogs: జగిత్యాల ప్రతినిధి, మార్చి 5 (మన బలగం): పోలీస్ జాగిలాలు నేర పరిశోధనలో, భద్రతా చర్యలకు మాదకద్రవ్యాల నియంత్రణ కోసం విపత్తు పరిస్థితుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయాని, శిక్షణా సామర్థ్యం వల్ల పోలీసులు విభిన్న ఆపరేషన్లలో వీటిని వినియోగిస్తున్నారని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానం దగ్గర పోలీస్ జగిలాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గదులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ జాగిలాలకు ఇంతకు ముందు ఎస్సార్ఎస్పీ క్వార్టర్స్‌లో ఉండేది అక్కడ సరైన వసతులు లేవని జిల్లా ఎస్పీ మా దృష్టికి తేవడం జరిగిందని వీటికి శాశ్వతంగా గదులను కేటాయించాలని ఉద్దేశంతో వీటిని ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. జగిలాలు నేరాల నిరోధం, విచారణ భద్రతాపరమైన చర్యల్లో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయన్నారు. వీటి అధిక సామర్థ్యం, విశ్వసనీయత ప్రత్యేక శిక్షణ కారణంగా పోలీస్ వారికి ఎంతగానో సహాయపడతాయి అని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ విశ్వాసానికి మారు పేరుగా నిలిచే జాగిలాలు పోలీస్‌ శాఖకు నేర పరిశోధనలో కీలకంగా మారుతున్నాయిని హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జరిగిన సమయంలో నిందితులను పట్టించడం, సంఘవిద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ప్రాణ, ఆస్తి నష్టం నివారించడంలో పోలీసు జాగిలాలు అత్యంత కీలక పాత్రను పోషిస్తున్నాయిని అన్నారు.

మాదకద్రవ్యాలు, బాంబులు ఇతర అనుమానాస్పద వస్తువులను గుర్తించడంలో ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయిని జిల్లాలో అనేక కేసులను ఛేదించడంలో, ఆధారాల సేకరణలో వీటి పనితీరు ప్రశంసనీయమైనది అని అన్నారు. పోలీస్ జాగిలాలకు అధునాతన శిక్షణ, వైద్య సంరక్షణ, తగిన సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆరు జగిలాలు ఉన్నాయని, వీటి నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీస్ జాగిలాల కోసం గదులను ఏర్పాటుకు సహాయం చేసిన జిల్లా కలెక్టర్‌కు ఎస్పీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణ సమయంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మెడల్‌ను సాధించిన డాగ్‌ను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి మెడల్‌ను ప్రదానం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీమ్ రావు, డీఎస్పీలు రఘు చందర్, రాములు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు కిరణ్ కుమార్, వేణు, టౌన్ ఇన్‌స్పెక్టర్ వేణు గోపాల్, డీసీ ఆర్బీ, ఎస్బీ, ఫింగర్ ప్రింట్స్ ఇన్‌సపెక్టర్లు శ్రీనివాస్ ఆరీఫ్ అలీ ఖాన్, శ్రీధర్, మరియు ఆర్.ఎస్.ఐలు, డాగ్స్ హాండ్లర్స్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *