Nirmal Mahalakshmi Temple Bonalu Security: నిర్మల్, జులై 19 (మన బలగం): నిర్మల్ పట్టణంలోని మహాలక్ష్మి ఆలయంలో ఆదివారం జరిగే బోనాలకు జిల్లా ఎస్పీ జానకి షర్మిలను ఆలయ చైర్మన్ కొడకల శ్రీకాంత్ శనివారం కలిసి ఆహ్వానించారు. అలాగే మేడిపల్లి నుంచి వచ్చే ఊరేగింపునకు భద్రత కల్పించాలని కోరారు. ఆలయ ఆవరణలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని విన్నవించారు. ఈయన వెంట బోయవాడ మాజీ కౌన్సిలర్ చైతన్య, బంగల్‌పేట్ యూత్ అధ్యక్షుడు పెండం శ్రీనివాస్, సభ్యులు రామ్‌రాజ్, అడప శ్రీకాంత్ ఉన్నారు.