సదర్‌మాట్ భూములను పరిశీలించిన ఆర్డీవో బృందం
land survey: ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 8 (మన బలగం): జగిత్యాల జిల్లా మెట్‌పల్లి డివిజన్ ఆర్డీవో శ్రీనివాస్ శనివారం ఇరిగేషన్, అటవీశాఖ, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి శనివారం ట్రాక్టర్‌లో వెళ్లి సదర్‌మాట్ భూములను పరిశీలించారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మూలరాంపూర్-నిర్మల్ జిల్లా మామడ మండలం పొనకల్ గ్రామాల శివారులోని గోదావరి నది తీరంపైన నిర్మించిన సదర్‌మార్ట్ బ్యారేజ్ పరిధిలోని కోమటి కొండాపూర్ గ్రామంలో కుర్రు 339 సర్వే నెంబర్‌లోని 36.39 ఎకరాల భూముల జాయింట్ సర్వేను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి అకు రాజ్ కుమార్, ఇరిగేషన్ అధికారులు అఖిల్, సదర్‌మాట్ బ్యారేజ్ డీఈ, ఏఈ, రైతులు తదితరులు పాల్గొన్నారు.