Maoist leader Prabhakar Rao
Maoist leader Prabhakar Rao

Maoist leader Prabhakar Rao: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత ప్రభాకర్ రావు

Maoist leader Prabhakar Rao: బీర్పూర్, డిసెంబర్ 23 (మన బలగం): మావోయిస్టు అగ్రనేత ప్రభాకర్ రావు అలియాస్ బల్మూరి నారాయణరావును ఛత్తీస్‌గఢ్ రాష్ర్ట పోలీసులు అరెస్టు చేసారు. ప్రభాకర్ రావుది జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రం. ఆదివారం తెల్లవారుజామున ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నార్త్ సబ్ జోనల్ బ్యూరోలో లాజిస్టిక్స్ సప్లై, ఎంవోపీవోఎస్ టీమ్ ఇన్‌చార్జిగా ప్రస్తుతం ప్రభాకర్ రావు కొనసాగుతున్నారు. ప్రభాకర్‌రావు 40 సంవత్సరాలుగా నక్సల్ సంస్థలో చురుకుగా పనిచేస్తున్నారు. అరెస్టయిన టాప్ నక్సలైట్ ప్రభాకర్ రావుపై ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదయ్యాయి. ఆయనపై ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. ప్రభాకర్ రావు కొన్ని రోజులుగా కంకేర్ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆదివారం కంకేర్లోని అంతఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు జరిపిన దిగ్బంధనం ఆపరేషన్‌లో ప్రభాకర్ రావును అరెస్టు చేశారు. ప్రభాకర్ రావు ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతూ నక్సల్ పార్టీలో చేరినట్లు సమాచారం. బీర్పూర్‌కు చెందిన బల్మూరి నారాయణరావు ది సామాన్య కుటుంబం. ముగ్గురు అన్నదమ్ములు, నలుగురు తోబుట్టువులు గల పెద్ద కుటుంబం. బీర్పూర్ గ్రామంలో నారాయణ రావు ఇంటిని కుటుంబ సభ్యులు అమ్ముకొని ఇతర ప్రాంతాలకు వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *