Advanced Robotic Brain and Spine Surgeries at Yashoda Hospitals: హైదరాబాద్ యశోద ఆసుపత్రులలో మెదడుకు రోబోటిక్ సర్జరీ సైతం చేస్తున్నామని న్యూరో సర్జన్ డాక్టర్ బి.జే రాజేశ్ తెలిపారు. గురువారం నిర్మల్ ప్రెస్‌క్లబ్‌లో న్యూరో సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ.. 30 సంవత్సరాల నుంచి యశోద హాస్పిటల్‌లో క్రిటికల్ బ్రెయిన్, వెన్నుముక సంబంధించిన సర్జరీలు చేస్తున్నామన్నారు. నిర్మల్ ప్రాంతానికి చెందిన మహిళ మెదడులో ఉన్న కణతిని ఆపరేషన్ చేసి తొలగించామన్నారు. అలాగే శ్రీనివాస్ అనే వ్యక్తికి వెన్నుముక ఆపరేషన్ నిర్వహించగా.. వీరిద్దరూ ప్రస్తుతం పూర్తిగా కోలుకొని మామూలు స్థితికి చేరుకున్నారని పేర్కొన్నారు. యశోదలో ఎన్నో సంవత్సరాలు అనుభవం కలిగిన న్యూరో సర్జన్స్ ఉన్నారని చెప్పారు. రోబోటిక్ టెక్నాలజీ ఉపయోగించి శాస్త్ర చికిత్సలు సైతం నిర్వహిస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల మెదడుకు తీవ్రమైన గాయాలు ఏర్పడిన సందర్భాల్లో రక్తస్రావాన్ని నిలిపివేయడం, మెదడు ఒత్తిడిని తగ్గించడం లాంటి ఎమర్జెన్సీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో యశోద ఆసుపత్రి సిబ్బంది, చికిత్స పొందిన పేషెంట్లు, తదితరులు పాల్గొన్నారు.