Double bedroom houses: నూకపల్లిలోని డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జగిత్యాల కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూకపల్లిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలలో రూ.32.36 కోట్లతో డ్రైనేజీ, నీటి వసతి, విద్యుత్ సౌకర్యం, పైపు లైన్ పనుల పురోగతిని తెలుసుకున్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో పీఆర్ ఈఈ రెహమాన్, శేఖర్ రెడ్డి, డిప్యూటీ ఈఈ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, తహసీల్దార్, తదితరులు పాల్గొన్నారు.