Locked to Rythu Vedika: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు. రుణమాఫీ కాకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ రైతు వేదికకు తాళం వేశారు. ఆగస్టు 15 వరకు రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పారని, ఇప్పటికైనా ప్రతి ఒక్క రైతుకు రైతు రుణమాఫీ చేయాలని రైతుల డిమాండ్ చేశారు. వానకాలం సీజన్ ముగుస్తున్నా ఇప్పటివరకు రైతుబంధు రాలేదని, వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతు రుణమాఫీ, రైతు బంధు నిధులు మంజూరు చేయాలని కోరారు. లేకుంటే రానున్న రోజుల్లో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతులు ఏలేటి చిన్నారెడ్డి, నాంపల్లి రమేశ్, కల్లెం చిన్న సాయన్న, బాస జలంధర్, తీగల రవీందర్ రెడ్డి, బద్దం సత్యారెడ్డి, సరసం ప్రసాద్, పడాల రాజేందర్ రైతులు తదితరులు పాల్గొన్నారు.