Arya Vaishya Mahasabha: పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చొద్దని మంగళవారం జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో కలెక్టర్ సత్య ప్రసాద్‌కు వినతి పత్రం సమర్పించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మార్చవద్దని, ఆయన రాష్ట్ర ప్రగతి కోసం చేసిన సేవలను గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మహాసభ జిల్లా అధ్యక్షుడు మైలారం లింబాద్రి, ఆర్యవైశ్య సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.