Dharmapuri Lakshminarasimhaswamy: ధర్మపురి, డిసెంబర్ 22 (మన బలగం): జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి క్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రూ.2,06,536 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,13,742, ప్రసాదాల అమ్మకం ద్వారా 72,955, అన్నదానం ద్వారా రూ 19,839 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.