Model School
Model School

Model School: ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువు పెంపు

Model School: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, మార్చి 9 (మన బలగం): తెలంగాణ మోడల్ స్కూల్ 2025-26 విద్యా సంవత్సరంలో 6 వ తరగతి లో 100 సీట్లు మరియు 7 నుండి 10 వ తరగతిలో మిగిలిన సీట్ల ప్రవేశ పరీక్ష ఆన్లైన్ దరఖాస్తుల గడువు తేదీని మార్చి-20-2025 వరకు మరియు పరీక్ష తేదీని పరీక్ష తేదీ : 13 /04/ 2025 పొడిగించడం జరిగింది అని ప్రిన్సిపల్ డాక్టర్ కె అశోక్ తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ వీర్నపల్లి మరియు ఎల్లారెడ్డిపేట్ మండలంలో గల విద్యార్థిని విద్యార్థులకు 6వ తరగతిలో 100 సీట్లు మరియు 7 నుండి 10వ తరగతిలో భర్తీ కానీ సీట్ల కొరకు ప్రవేశ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. అర్హత గల విద్యార్థులు మార్చి-20-2025 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవలసిందిగా కోరనైనది. పరీక్ష తేదీ : 20 /04/ 2025  Website :htpps//telanganams.cgg.gov.in ఫీజు వివరాలు OC-200 BC,SC,ST మరియు PHC, EWS విద్యార్థిని విద్యార్థులు 125 రూపాయలను దగ్గరలోని ఆన్లైన్ సెంటర్లో చెల్లించి దరఖాస్తులు సమర్పించవలసిందిగా ప్రిన్సిపల్ డాక్టర్ కె. అశోక్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *