National Maths Day: ముధోల్ 21 డిసెంబర్ (మన బలగం): ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ముందస్తుగా జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రపంచ మేధావి శ్రీనివాస రామానుజన్ గురించి, వారి పరిశోధనల గురించి, వారు కనిపెట్టిన సూత్రాల గురించి వివరించారు. అనంతరం విద్యార్థులు గణిత కృత్యాలు ప్రదర్శించారు. విద్యార్థులకు వక్తృత్వ పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహించారు. బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల సమితి కార్యదర్శి ధర్మపురి సుదర్శన్, పాఠశాల కార్యదర్శి కంది మానాజీ, సహ కార్యదర్శి వేదపాఠక్ నిశికాంత్, కమిటీ సభ్యులు దర్బార్ నవీన్ ప్రధానాచార్యులు సారథి రాజు, అకాడమిక్ ఇన్చార్జి దేవేందర్ చారి, ఆచార్యులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణితం బోధించే ఆచార్యులకు పాఠశాల ద్వారా సన్మానించారు.