CM Cup Volleyball: మనబలగం, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి సీఎం కప్ 2024 వాలీబాల్ పోటీలు శనివారం ముగిసాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం మినీ స్టేడియంలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున సిరిసిల్ల మినీ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. వాలీబాల్ పోటీల్లో ఉమెన్ విభాగంలో కరీంనగర్ జిల్లా ప్రథమ స్థానంలో, రాజన్న సిరిసిల్ల ద్వితీయ స్థానంలో నిలిచాయి. అలాగే మెన్ విభాగంలో రాజన్న సిరిసిల్ల ప్రథమ, జగిత్యాల జిల్లా ద్వితీయ స్థానాలు పొందాయి. ప్రథమ బహుమతిగా, గోల్డ్ మెడల్ ద్వితీయ బహుమతిగా సిల్వర్ మెడల్ ను బహూకరించారు. కరీంనగర్ వాలీబాల్ అసోసియేషన్ సెక్రెటరీ గిన్ని లక్ష్మణ్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. సిరిసిల్ల వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కుమార్ రావు, జగిత్యాల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సుధీర్ రావు, వాలీబాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఎం.కృష్ణారెడ్డి, చీఫ్ అడ్వైజర్ సిరిసిల్ల గుడ్ల రవి, మరియు వాలీబాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్యాం కుమార్ పాల్గొన్నారు. ఎస్జీఎఫ్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్, డివైఎస్ఓ. రాందాస్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు.